Skip to content

Pedaiah గురించి బైబిల్ వచనాలు

8 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. యెహోయాకీము రాజైనప్పుడు, అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి, పెదాయా కుమార్తెయైన జెబూదా, ఆమె రూమా పట్టణస్థురాలు.

  2. మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా.

  3. పెదాయా కుమారులు: జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు: మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సోదరి.

  4. ఎఫ్రాయిమీయుల మీద: అజజ్యాహు కుమారుడైన హోషేయ; మనష్షే అర్థగోత్రం మీద: పెదాయా కుమారుడైన యోవేలు;

  5. ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు.

  6. అప్పుడు ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా చెక్కతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవారు ఉన్నారు; ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవారు ఉన్నారు.

  7. బెన్యామీను వారసుల నుండి: సల్లు, ఇతడు యెషయా కుమారుడైన ఇతీయేలుకు పుట్టిన మయశేయా కుమారుడైన కోలాయాకు పుట్టిన పెదాయా కుమారుడైన యోవేదుకు పుట్టిన మెషుల్లాము కుమారుడు,

  8. యాజకుడైన షెలెమ్యా, శాస్త్రియైన సాదోకు, లేవీయుడైన పెదాయాలను గిడ్డంగుల మీద అధికారులుగా నియమించాను. అలాగే వారికి సహాయంగా జక్కూరు కుమారుడును, మత్తన్యా మనుమడునైన హానానును నియమించాను ఎందుకంటే వీరంతా నమ్మకస్థులుగా పేరు పొందారు. తమ తోటి లేవీయులకు ఆహారం పంచి ఇవ్వాల్సిన బాధ్యత అప్పగించబడింది.