Skip to content

New Moon గురించి బైబిల్ వచనాలు: Feast of

8 వచనాలు · 2 కోణాలు

Feast of గురించి వచనాలు

  1. అంతేకాక మీ సంతోష సమయాల్లో అంటే నియమించబడిన పండుగలు, అమావాస్య వేడుకలప్పుడు మీ దహనబలులు, మీ సమాధాన బలులపై బూరధ్వని చేయండి. అవి మీ దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉంటాయి. నేను మీ దేవుడనైన యెహోవానై ఉన్నాను.”

  2. “ ‘ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, యేడు ఏడాది మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.

  3. ప్రతి కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండితో భోజనార్పణ ఉండాలి; పొట్టేలుతో పాటు, నూనె కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి భోజనార్పణగా ఉండాలి;

  4. అలాగే ప్రతి గొర్రెపిల్లతో పాటు, నూనె కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని భోజనార్పణగా సమర్పించాలి. ఇది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలి.

  5. ప్రతి కోడెతో పాటు పానార్పణగా అర హిన్ ద్రాక్షరసం ఉండాలి; పొట్టేలుతో పాటు, హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం; ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం అర్పించాలి. సంవత్సరంలో ప్రతి అమావాస్యకు అర్పించాల్సిన దహనబలి ఇది.

  6. క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, దాని పానార్పణంతో పాటు, యెహోవాకు పాపపరిహారబలిగా ఒక మేకపోతును అర్పించాలి.

  7. And to offer all burnt sacrifices unto the LORD in the sabbaths, in the new moons, and on the set feasts, by number, according to the order commanded unto them, continually before the LORD:

  8. యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం ఉదయం, సాయంకాలం అర్పించిన వలసిన దహనబలుల కోసం, సబ్బాతు దినాలు అమావాస్య రోజులు నియమించబడిన పండుగ కాలాలు అర్పించవలసిన దహనబలుల కోసం రాజు తన ఆస్తినుండి ఇచ్చాడు.