Nethaneel గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదడానికి నియమించబడ్డారు. ఓబేద్-ఎదోము, యెహీయా దేవుని మందసానికి కావలివారిగా కూడ నియమించబడ్డారు.
లేవీయులలో లేఖికునిగా ఉన్న నెతనేలు కుమారుడైన షెమయా, వారి పేర్లను రాజు, అతని అధికారులు యాజకుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు, యాజకుల కుటుంబ పెద్దలు, లేవీయుల ఎదుట నమోదు చేశాడు. ఒక కుటుంబం ఎలియాజరు నుండి, తర్వాత మరొక కుటుంబం ఈతామారు నుండి తీసుకోబడింది.
ఓబేద్-ఎదోముకు కూడా కుమారులు ఉన్నారు: షెమయా మొదటివాడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాలుగవవాడు, నెతనేలు అయిదవవాడు,
తాను పరిపాలిస్తున్న మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లో ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్-హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే నాయకులను పంపాడు.
కొనన్యా, అతని సహోదరులైన షెమయా, నెతనేలు, లేవీయుల నాయకులైన హషబ్యా, యెహీయేలు, యోజాబాదులు లేవీయుల కోసం 5,000 గొర్రెపిల్లలు మేకలు 500 కోడెలను పస్కా అర్పణలుగా ఇచ్చారు.
పషూరు వారసుల నుండి: ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
హిల్కీయా కుటుంబానికి హషబ్యా; యెదాయా కుటుంబానికి నెతనేలు.
అతని సహాయకులైన షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవారు దేవుని సేవకుడైన దావీదు నిర్దేశించిన సంగీత వాయిద్యాలు వాయిస్తూ వెళ్లారు. ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా వారిని నడిపించాడు.