కంటెంట్‌కు వెళ్లండి

Naamah గురించి బైబిల్ వచనాలు

5 వచనాలు · 3 కోణాలు

"Naamah" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. సిల్లా కూడా ఒక కుమారునికి జన్మనిచ్చింది, అతని పేరు తూబల్-కయీను, అతడు అన్ని రకాల ఇత్తడి ఇనుప పనిముట్లు తయారుచేయడంలో నిపుణుడు. తూబల్-కయీను యొక్క సోదరి నయమా.

  2. గెదెరోతు, బేత్-దాగోను, నయమా, మక్కేదా మొత్తం పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు.

  3. సొలొమోను కుమారుడైన రెహబాము యూదాలో రాజుగా ఉన్నాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు. రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు.

  4. రెహబాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని తన పూర్వికుల దగ్గర సమాధి చేశారు. అతని తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు. అతని తర్వాత అతని కుమారుడు అబీయా రాజయ్యాడు.

  5. రాజైన రెహబాము యెరూషలేములో సుస్థిరంగా ఉండి రాజుగా పరిపాలిస్తూ వచ్చాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు, రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు.