Skip to content

Inheritance గురించి బైబిల్ వచనాలు

34 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు బోయజు పెద్దలకు, ప్రజలందరికి ఇలా ప్రకటించాడు, “ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతా నయోమి దగ్గర నుండి నేను కొనుక్కున్నాను. ఈ రోజు దీనికి మీరు సాక్షులు.

  2. అంతేకాక, చనిపోయిన మహ్లోను యొక్క విధవరాలు, మోయాబీయురాలైన రూతును నా భార్యగా స్వీకరిస్తున్నాను. ఈ విధంగా చనిపోయినవాడి స్వాస్థ్యం మీద అతని పేరు స్థిరంగా ఉంటుంది, అతని కుటుంబం నుండి, అతని స్వస్థలం నుండి కొట్టివేయబడదు. ఈ రోజు మీరు సాక్షులు!”

  3. అప్పుడు పెద్దలు, పట్టణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరు, “మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వస్తున్న స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశాన్ని కట్టిన రాహేలు, లేయాల వలె చేయును గాక. ఎఫ్రాతాలో నీవు ఘనత పొంది, బేత్లెహేములో ఖ్యాతి నొందుదువు గాక.

  4. యెహోవా ఈ యువతి ద్వారా నీకు ఇచ్చే సంతానం ద్వారా, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు వలె ఉండును గాక!” అని అన్నారు.

  5. బోయజు రూతును చేర్చుకున్నాడు, ఆమె తన భార్య అయ్యింది. ఆమెతో పడుకున్నప్పుడు, యెహోవా ఆమె గర్భవతి అయ్యేలా దీవించారు, ఆమె ఒక కుమారున్ని కన్నది.

  6. అప్పుడు స్త్రీలు నయోమితో అన్నారు: “ఈ రోజున నిన్ను విడిపించే సమీపబంధువు ఉండేలా చేసిన యెహోవా స్తుతినొందును గాక. ఇశ్రాయేలులో అతనికి ఖ్యాతి కలుగును గాక!

  7. అతడు నీ జీవితాన్ని నూతనపరచి, నీ వృద్ధాప్యంలో నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే, ఏడుగురు కుమారుల కంటే ఉత్తమమైన నీ కోడలు, అతనికి జన్మనిచ్చింది.”

  8. నయోమి ఆ బాలున్ని తన చేతుల్లోకి తీసుకుని వానికి దాదిగా ఉన్నది.

  9. అక్కడ నివసిస్తున్న ఆమె పొరుగు స్త్రీలు, “నయోమికి కుమారుడు ఉన్నాడు!” అని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. అతడు దావీదు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి.