కంటెంట్‌కు వెళ్లండి

Hospitality గురించి బైబిల్ వచనాలు

58 వచనాలు · 28 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దానికి బదులు, అతడు ఆతిథ్యాన్ని ఇచ్చేవానిగా, మంచిని ప్రేమించేవానిగా, స్వీయ నియంత్రణ కలవానిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, క్రమశిక్షణ కలవాడై ఉండాలి.

  2. సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి.

  3. అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు దేవుని నుండి తాము పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి.

  4. ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.

  5. ప్రియ మిత్రుడా, నీకు పరిచయం లేని సహోదరి సహోదరుల కోసం నీవు చేస్తున్నదాంట్లో నమ్మకంగా ఉన్నావు.

  6. నీ ప్రేమ గురించి వారు సంఘానికి చెప్పారు. దయచేసి దేవుని ఘనపరచే విధంగా వారిని వారి మార్గంలో పంపు.

  7. దేవుని ఎరుగనివారి నుండి ఏమి తీసుకోకుండా ఆయన నామం నిమిత్తం వారు బయలుదేరారు.

  8. మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి.