Skip to content

Girdle గురించి బైబిల్ వచనాలు

13 వచనాలు · 7 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. మరో రెండు బంగారు ఉంగరాలను తయారుచేసి వాటిని ఏఫోదు నడికట్టుకు కొంచెం పైన దాని అతుకు దగ్గరగా ఏఫోదు ముందు భాగంలో రెండు భుజభాగాలకు క్రింది వైపున జోడించాలి.

  2. అప్పుడు రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టాలి.

  3. యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి నార పట్టీ కొని నీ నడుముకు పెట్టుకో, అయితే అది నీళ్లతో తడపవద్దు.”

  4. కాబట్టి నేను యెహోవా ఆజ్ఞాపించినట్లే నడుముకు నార పట్టీ పెట్టుకున్నాను.

  5. రెండవసారి యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది:

  6. “నీవు కొనుక్కుని నడుముకు పెట్టుకున్న పట్టీని తీసుకుని నీవిప్పుడు పేరతు నది ఒడ్డుకు వెళ్లి, అక్కడ బండ సందులో దాన్ని దాచి పెట్టు.”

  7. కాబట్టి యెహోవా నాకు చెప్పినట్లే నేను వెళ్లి పేరతు దగ్గర దాన్ని దాచి పెట్టాను.

  8. చాలా రోజుల తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఇప్పుడే నీవు పేరతు నది ఒడ్డుకు వెళ్లి అక్కడ దాచిపెట్టుమని నేను చెప్పిన పట్టీని తెచ్చుకో.”

  9. కాబట్టి నేను పేరతు నది ఒడ్డుకు వెళ్లి త్రవ్వి దాచిపెట్టిన స్థలంలో నుండి ఆ పట్టీని తీసుకున్నాను, కానీ ఇప్పుడు అది పాడై, పూర్తిగా పనికిరాకుండా పోయింది.

  10. అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  11. “యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా గర్వాన్ని, యెరూషలేము గొప్ప అహంకారాన్ని కూడా అదే విధంగా నాశనం చేస్తాను.

  12. నా మాటలు వినకుండ, తమ హృదయాల మొండితనాన్ని అనుసరించి, ఇతర దేవుళ్ళను సేవించే, ఆరాధించే ఈ దుష్ట ప్రజలు ఈ పట్టీలా ఎందుకు పనికిరానివారిగా ఉంటారు!

  13. నడుముకు పట్టీ కట్టినట్లు నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదా ప్రజలందరినీ, నా కీర్తి, స్తుతి ఘనత కోసం నా ప్రజలుగా ఉండడానికి నాకు కట్టుకున్నాను. కానీ వారు వినలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.