Skip to content

Dowry గురించి బైబిల్ వచనాలు

9 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. “ఒకడు పెళ్ళి నిశ్చయించబడని కన్యను లోబరచుకొని ఆమెతో పడుకుంటే అతడు ఆమెకు కట్నం చెల్లించి ఆమెను తన భార్యగా చేసుకోవాలి.

  2. ఆమె తండ్రి ఆమెను అతనికి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోకపోతే అతడు కన్యకల కట్నం ప్రకారం డబ్బు చెల్లించాలి.

  3. అతడు ఆ బంధువుతో అన్నాడు, “మోయాబు నుండి తిరిగివచ్చిన నయోమి, మన బంధువైన ఎలీమెలెకుకు చెందిన భూమిని అమ్మి వేస్తుంది.

  4. ఈ విషయం నీ దృష్టికి తీసుకురావాలని, నీవు నా ప్రజల పెద్దల ఎదుట దానిని కొనాలని నేను అనుకున్నాను. నీవు విడిపిస్తే విడిపించు. కాని ఒకవేళ నీవు విడిపించకపోతే నాకు చెప్పు, నేను తీసుకుంటాను. ఎందుకంటే నీకు తప్ప ఇంకెవరికీ ఆ హక్కు లేదు, నీ తర్వాత నేను ఉన్నాను.” “నేను విడిపిస్తాను” అని అతడు అన్నాడు.

  5. అప్పుడు బోయజు అన్నాడు, “నయోమి దగ్గర నీవు ఆ భూమిని కొన్న రోజు, చనిపోయిన వాని భార్య, మోయాబీయురాలైన రూతు నీకు చెందుతుంది, ఈ విధంగా చనిపోయిన వాని స్వాస్థ్యంతో అతని సంతతిని నిలబెడతావు.”

  6. ఇది విని, ఆ బంధువు, “అయితే నేను దానిని విడిపించలేను, ఎందుకంటే నా స్వాస్థ్యాన్ని కోలిపోతానేమో. నీవే దానిని విడిపించు. నేను చేయలేను” అని అన్నాడు.

  7. (ఇప్పుడు ఇశ్రాయేలులో పూర్వకాలంలో, ఆస్తిని విడిపించడం గాని బదిలీ చేయడం గాని నిర్ధారణ చేయడానికి, ఒక పక్షం వాడు తన చెప్పు తీసి ఇతర పక్షం వానికి ఇచ్చేవాడు. ఇశ్రాయేలులో లావాదేవీలను చట్టబద్ధం ఇలాగే చేసేవారు.)

  8. కాబట్టి ఆ సమీపబంధువు బోయజుతో, “నీవే దానిని కొనుక్కో” అని చెప్పి, తన చెప్పును తీశాడు.

  9. అప్పుడు బోయజు పెద్దలకు, ప్రజలందరికి ఇలా ప్రకటించాడు, “ఎలీమెలెకు, కిల్యోను, మహ్లోనులకు చెందిన ఆస్తినంతా నయోమి దగ్గర నుండి నేను కొనుక్కున్నాను. ఈ రోజు దీనికి మీరు సాక్షులు.