కంటెంట్‌కు వెళ్లండి

Contracts గురించి బైబిల్ వచనాలు: Between Laban and Jacob for cattle

7 వచనాలు · 3 కోణాలు

"Contracts" కోసం వెతకండి

Between Laban and Jacob for cattle గురించి వచనాలు

  1. అయితే లాబాను, “నీకు నాపై దయ ఉంటే, దయచేసి ఉండు. నిన్ను బట్టి యెహోవా నన్ను దీవించారని నేను భవిష్యవాణి ద్వార తెలుసుకున్నాను.

  2. నీకెంత జీతం కావాలో అడుగు, ఇస్తాను” అని అన్నాడు.

  3. యాకోబు అతనితో, “నీకోసం ఎంత పని చేశానో, నా ఆధీనంలో నీ మంద ఎంత ఎదిగిందో నీకు తెలుసు.

  4. లాబాను, “నీకు ఏమివ్వాలి?” అని అడిగాడు. అందుకు యాకోబు, “నాకు ఈ ఒక్కటి చేస్తే చాలు వేరే ఏమి అక్కర్లేదు. నేను నీ మందను కాపాడుతూ మేపుతాను:

  5. ఈ రోజు నేను నీ మందలన్నిటి మధ్య గుండా వెళ్లి పొడలు, మచ్చలు ఉన్న ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలలో నల్లవాటిని, మేకలలో మచ్చలు, పొడలు గలవాటిని వేరు చేస్తాను. వాటిని నాకు జీతంగా ఇవ్వు.

  6. నీవు నాకు జీతంగా ఇచ్చిన వాటిని పరిశీలించడానికి వచ్చినప్పుడు నేను యథార్థంగా ఉన్నట్లు నీవు చూస్తావు. మచ్చలు, పొడలు లేని మేకలు లేదా నల్ల గొర్రెపిల్లలు నా దగ్గర ఉంటే, అవి నేను దొంగిలించాను అని గ్రహించ వచ్చు” అని అన్నాడు.

  7. లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు.