Burial గురించి బైబిల్ వచనాలు: The Jews anxious to be interred in their family places of
The Jews anxious to be interred in their family places of గురించి వచనాలు
ఇశ్రాయేలు చనిపోయే సమయం సమీపించినప్పుడు, తన కుమారుడైన యోసేపును పిలిపించి, “నీ దృష్టిలో నేను దయ పొందినవాడనైతే, నా తొడ క్రింద చేయి పెట్టి, నా పట్ల మంచితనాన్ని, నమ్మకత్వాన్ని చూపుతావని ప్రమాణం చేయి. ఈజిప్టులో నన్ను పాతిపెట్టకు,
నా పితరులతో నేను నిద్రించినప్పుడు, ఈజిప్టు నుండి నన్ను తీసుకెళ్లి వారు పాతిపెట్టబడిన దగ్గరే నన్ను పాతిపెట్టు” అని చెప్పాడు. “నీవు చెప్పినట్టే చేస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు.
అయితే యాకోబు, “నాతో ప్రమాణం చేయి” అని అన్నాడు. అప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాడు, ఇశ్రాయేలు తన చేతికర్ర మీద ఆనుకుని ఆరాధించాడు.