Boil గురించి బైబిల్ వచనాలు: Levitical ceremonies prescribed for
Levitical ceremonies prescribed for గురించి వచనాలు
“ఎవరికైనా వారి చర్మం మీద బొబ్బ వచ్చి మానిపోతే,
అది ఉండిన చోట, తెల్లని వాపు గాని లేదా గులాబి రంగు మచ్చ గాని కనిపిస్తే, వారు దానిని యాజకునికి చూపించాలి.
యాజకుడు దానిని పరీక్షించాలి, ఒకవేళ అది చర్మంపై లోతుగా ఉండి దానిలోని వెంట్రుకలు తెల్లబారినట్లు కనిపిస్తే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి. అది బొబ్బ ఉన్నచోట బయటపడిన తీవ్రమైన కుష్ఠువ్యాధి.
యాజకుడు పరీక్షించినప్పుడు, అందులో తెల్లని వెంట్రుకలు లేకపోతే, చర్మంపై లోతుగా లేకుండ కొంచెం మాని ఉంటే, యాజకుడు పరీక్షించి వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.
ఒకవేళ అది చర్మంపై వ్యాపిస్తూ ఉంటే, యాజకుడు వారిని అపవిత్రులని ప్రకటించాలి; అది తీవ్రమైన కుష్ఠువ్యాధి లక్షణము.
అయితే ఒకవేళ ఆ మచ్చ వ్యాపించకుండ అలాగే ఉంటే, అది కేవలం ఒక బొబ్బను బట్టి ఏర్పడిన మచ్చ, యాజకుడు వారిని పవిత్రులని ప్రకటించాలి.