Skip to content

Alpha గురించి బైబిల్ వచనాలు

7 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఎవరు దీనిని ఆలోచించి జరిగించారు? మొదటి నుండి తరాలను పిలిచింది ఎవరు? యెహోవానైన నేనే; వారిలో మొదటి వారితో ఉంది నేనే, చివరి వరకు వారితో ఉండేది నేనే.”

  2. “ఇశ్రాయేలీయుల రాజు, విమోచకుడు, సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: నేను మొదటివాడను చివరివాడను; నేను తప్ప ఏ దేవుడు లేడు.

  3. “యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయనను; నేనే మొదటివాడను నేను చివరివాడను.

  4. “అల్ఫా ఒమేగాను నేనే, గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడను రానున్నవాడను నేనే” అని సర్వశక్తిగల ప్రభువైన దేవుడు చెప్తున్నారు.

  5. ఆ స్వరం, “నీవు చూసినవాటిని ఒక గ్రంథపుచుట్టలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే ఏడు సంఘాలకు పంపించు” అని చెప్పడం విన్నాను.

  6. ఆయన నాతో, “సమాప్తమైనది. అల్ఫా ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.

  7. అల్ఫా ఒమేగాను నేనే, మొదటివాడను చివరివాడను నేనే, ఆది అంతం నేనే!