Sisera
Sisera ను ప్రస్తావించే వచనాలు
కాబట్టి యెహోవా వారిని హాసోరులో పరిపాలించే కనాను రాజైన యాబీను చేతికి అప్పగించారు. అతని సేనాధిపతి హరోషెత్-హగ్గోయిములో నివసించిన సీసెరా.
యాబీను సేనాధిపతియైన సీసెరాను, అతని రథాలను, అతని సైన్యాన్ని కీషోను నది దగ్గరకు నడిపించి నీ చేతికి అతన్ని అప్పగిస్తాను.’ ”
అప్పుడు దెబోరా, “నీతో నేను తప్పకుండా వస్తాను, అయితే నీ ప్రయాణం వలన నీకు ఘనత రాదు, ఎందుకంటే యెహోవా ఒక స్త్రీకి సీసెరాను అప్పగిస్తారు” అని చెప్పి ఆమె బారాకుతో కలిసి కెదెషుకు వెళ్లింది.
అబీనోయము కుమారుడైన బారాకు తాబోరు పర్వతం మీదికి వెళ్లాడని సీసెరాకు చెప్పినప్పుడు,
సీసెరా హరోషెత్-హగ్గోయిము నుండి కీషోను వాగువరకు తన సైన్యమంతటిని, తన తొమ్మిది వందల ఇనుప రథాలను పిలిపించుకున్నాడు.
అప్పుడు దెబోరా బారాకుతో, “వెళ్లు! ఈ రోజు యెహోవా నీ చేతికి సీసెరాను అప్పగించారు. యెహోవా నీకు ముందుగా వెళ్లలేదా?” అని అడిగినప్పుడు బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతం నుండి దిగి వెళ్లాడు.
బారాకు దాడి చేసినప్పుడు యెహోవా సీసెరాను, అతని రథాలన్నిటిని, అతని సైన్యాన్ని ఖడ్గంతో హతం చేయగా సీసెరా తన రథాన్ని దిగి కాలినడకన పారిపోయాడు.
బారాకు ఆ రథాలను, సైన్యాన్ని హరోషెత్-హగ్గోయిము వరకు వెంటాడగా సీసెరా సైన్యమంతా ఖడ్గంతో చంపబడ్డారు; ఏ ఒక్కరు మిగల్లేదు.
హాసోరు రాజైన యాబీనుకు, కెనీయుడైన హెబెరు కుటుంబానికి మధ్య స్నేహబంధం ఉండేది కాబట్టి సీసెరా కాలినడకన కెనీయుడైన హెబెరు భార్యయైన యాయేలు గుడారానికి పారిపోయాడు.
యాయేలు సీసెరాను కలుసుకోడానికి బయటకు వెళ్లి, “నా ప్రభువా, లోనికి రండి. భయపడకండి” అని అన్నది. కాబట్టి అతడు గుడారంలోకి వెళ్లగా ఆమె దుప్పటితో అతన్ని కప్పింది.
అప్పుడు బారాకు సీసెరాను తరుముతూ వెళ్తునప్పుడు యాయేలు అతన్ని ఎదుర్కొని, “రండి, మీరు వెదుకుతున్న మనిషిని నేను చూపిస్తాను” అని అన్నది. అతడు ఆమెతో లోనికి వచ్చినప్పుడు, అక్కడ సీసెరా కణతలలో మేకుతో చచ్చి పడి ఉన్నాడు.
నక్షత్రాలు ఆకాశం నుండి పోరాడాయి, తమ ఆకాశమార్గాల్లో నుండి సీసెరాతో విరుద్ధంగా పోరాడాయి.
ఆమె తన చేతితో గుడారపు మేకు కోసం చేయి చాచింది, పనివాని సుత్తి కోసం ఆమె కుడిచేయి చాచింది. ఆమె సీసెరాను కొట్టింది, ఆమె అతని తల చితక్కొట్టింది. ఆమె అతని తలను బద్దలు చేసింది.
“సీసెరా తల్లి కిటికీలో నుండి చూస్తూ ఉంది; అల్లిక కిటికీలో నుండి చూస్తూ ఏడుస్తుంది, ‘అతని రథం తిరిగి రావడానికి ఎందుకు ఇంత సమయం పడుతోంది? అతని రథాల చప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది?’
‘దోపుడుసొమ్ము వారికి దొరకలేదా, వారు పంచుకోలేదా: ప్రతి మనిషికి ఒకరు, లేదా ఇద్దరు స్త్రీలను తీసుకుంటారు, సీసెరాకు దోపుడు సొమ్ముగా రంగువేసిన వస్త్రాలు, కుట్టుపని చేసిన రంగుల వస్త్రాలు, వారి మెడలకు తగిన రెండు వైపులా రంగులు అద్దిన కుట్టుపని చేసిన వస్త్రాలు ఇదంతా దోపుడు సొమ్ముగా తీసుకోలేదా?’
“అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు; ఆయన వారిని హాసోరు సేనాధిపతియైన సీసెరా చేతికి ఫిలిష్తీయుల చేతికి మోయాబు రాజు చేతికి అప్పగించినప్పుడు వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు.
మిద్యానుకు చేసినట్లుగా, కీషోను నది దగ్గర సీసెరా యాబీనుకు చేసినట్లుగా వారికి చేయండి.