Skip to content

Delilah

6 వచనాలు · 1 కుటుంబ సభ్యుడు

Delilah ను ప్రస్తావించే వచనాలు

  1. కొంతకాలం తర్వాత అతడు శోరేకు లోయకు చెందిన దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు.

  2. కాబట్టి దెలీలా సంసోనుతో, “నీ గొప్ప బలం యొక్క రహస్యం ఏంటో నాకు చెప్పవా, నిన్ను కట్టి లోబరుచుకోవడం ఎలా?” అని అడిగింది.

  3. అప్పుడు దెలీలా సంసోనుతో, “నీవు నన్ను మోసం చేశావు; నాకు అబద్ధం చెప్పావు. సరే ఇప్పుడైనా నిజం చెప్పు” అని అన్నది.

  4. కాబట్టి దెలీలా క్రొత్త త్రాళ్లు తెచ్చి వాటితో అతన్ని కట్టేసి గదిలో మనుష్యులతో దాక్కొని ఉండగా, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని చెప్పింది. అయితే అతడు త్రాళ్లను నూలుపోగుల వలె తెంపేశాడు.

  5. అప్పుడు దెలీలా సంసోనుతో, “అప్పుడు దెలీలా సంసోనుతో, ఈసారి కూడా నీవు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. నిన్ను ఎలా బంధించవచ్చో చెప్పు” అని అన్నది. అతడు జవాబిస్తూ, “బహుశ నా జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లితే వాటిని అనపసూదితో కట్టేస్తే నేను అందరు మనుష్యుల్లా బలహీనుడను అయిపోతాను” అని అన్నాడు కాబట్టి అతడు పడుకున్నప్పుడు దెలీలా అతని జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లి,

  6. అతడు తనకు మొత్తం చెప్పాడని దెలీలా గ్రహించి, ఫిలిష్తీ నాయకులకు, “మరోసారి మీరు రండి; అతడు నాకు మొత్తం చెప్పాడు” అని కబురు పంపింది. కాబట్టి ఫిలిష్తీయుల నాయకులు తమతో వెండిని తీసుకువచ్చారు.