కంటెంట్‌కు వెళ్లండి

Abimelech

35 వచనాలు · 3 కుటుంబ సభ్యులు

Abimelech ను ప్రస్తావించే వచనాలు

  1. అబీమెలెకు, అతనితో ఉన్న గుంపులు, ముందుకు వెళ్లి పట్టణ ద్వారం దగ్గర నిలిచి ఉన్నప్పుడు, ఆ రెండు గుంపులు పొలాల్లో ఉన్నవారిపై దాడి చేసి వారిని చంపారు.

  2. ఆ రోజంతా అబీమెలెకు పట్టణంపై దాడి చేసి, ముట్టడిచేసి, దాని ప్రజలను చంపాడు. తర్వాత పట్టణాన్ని నాశనం చేసి దానిపై ఉప్పు చల్లాడు.

  3. షెకెము గోపుర పౌరులు అక్కడ గుమికూడారని అబీమెలెకు విన్నప్పుడు,

  4. అతడు, అతనితో ఉన్న మనుష్యులందరు, సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు ఒక గొడ్డలి తీసుకుని కొన్ని కొమ్మలను నరికి, తన భుజంపై పెట్టుకున్నాడు. తన మనుష్యులను ఆదేశిస్తూ, “త్వరపడండి! నేను ఏమి చేస్తున్నానో అదే మీరు చేయండి!” అన్నాడు.

  5. కాబట్టి ఆ మనుష్యులందరు కొమ్మలు నరికి అబీమెలెకును వెంబడించారు. వారు బలమైన కోటను ముట్టడిచేసి ప్రజలు అందులో ఉన్నప్పుడే దానిని కాల్చారు. కాబట్టి షెకెము గోపురంలో ఉన్న దాదాపు వేయిమంది పురుషులు స్త్రీలు చనిపోయారు.

  6. తర్వాత అబీమెలెకు తేబేసుకు వెళ్లి దాని మీద దాడి చేసి దానిని వశపరచుకున్నాడు.

  7. అబీమెలెకు ఆ గోపురం దగ్గరకు వెళ్లి, దానిపై దాడి చేసి దాన్ని కాల్చివేయడానికి ఆ గోపుర ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు,

  8. అబీమెలెకు చనిపోయాడని ఇశ్రాయేలీయులు చూసి తమ గృహాలకు వెళ్లారు.

  9. ఈ విధంగా అబీమెలెకు తన డెబ్బైమంది సోదరులను చంపి తన తండ్రికి చేసిన ద్రోహాన్ని దేవుడు తిరిగి అతని మీదికి రప్పించారు.

  10. అబీమెలెకు చనిపోయిన తర్వాత ఇశ్శాఖారు గోత్రం నుండి దోదో మనుమడు, పువా కుమారుడైన తోలా ఇశ్రాయేలును రక్షించడానికి లేచాడు. అతడు ఎఫ్రాయిం కొండసీమలో, షామీరులో నివసించాడు.