- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
సిరియా మరియు ఫెనీకీయాపై తీర్పు
జెకర్యా 9:1-8
1
ప్రవచనం: హద్రాకు దేశం గురించి దమస్కు పట్టణం గురించి వచ్చిన యెహోవా వాక్కు: మనుష్యులందరి కళ్లు, ఇశ్రాయేలు గోత్రాలన్నిటి కళ్లు యెహోవా మీద ఉన్నాయి.
2
అంతేకాక, దాని సరిహద్దును ఆనుకుని ఉన్న హమాతు గురించి, చాలా నిపుణులైన తూరు సీదోను ప్రజల గురించి వచ్చిన యెహోవా వాక్కు.
3
తూరు తన కోసం బలమైన దుర్గం కట్టుకుంది; ధూళి అంత విస్తారంగా వెండిని, వీధుల్లోని మట్టి అంత విస్తారంగా బంగారాన్ని పోగుచేసింది.
4
అయితే యెహోవా దాని సంపదలు తీసివేసి, సముద్రంలో ఉన్న దాని శక్తిని నాశనం చేస్తారు. అది అగ్నితో కాల్చబడుతుంది.
5
అష్కెలోను దానిని చూసి భయపడుతుంది; గాజా వేదనతో విలపిస్తుంది ఎక్రోను కూడా తన నిరీక్షణ కోల్పోతుంది. గాజా తన రాజును కోల్పోతుంది అష్కెలోను ఎడారిగా మారుతుంది.
6
సంకరజాతి ప్రజలు అష్డోదును ఆక్రమిస్తారు, ఫిలిష్తీయుల గర్వాన్ని నేను అంతం చేస్తాను.
7
వారి నోటిలో నుండి రక్తాన్ని, వారి పళ్ల మధ్య నుండి తినకూడని ఆహారాన్ని నేను తీసివేస్తాను. వారిలో మిగిలి ఉన్నవారు మన దేవుని వారై యూదాలో ఒక వంశంగా ఉంటారు. ఎక్రోను వారు యెబూసీయుల్లా ఉంటారు.
8
నేను కళ్లారా చూస్తున్నాను కాబట్టి బాధించేవారు నా ప్రజలపై మరలా ఎన్నడూ దాడి చేయకుండా దోపిడి మూకలు నా మందిరం మీదికి రాకుండా కాపాడడానికి నేను దాని దగ్గర శిబిరం ఏర్పాటు చేస్తాను.
Settings