Skip to content
పరమగీతము 6:4-10

పరమగీతము 6:4-10

4
నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు, యెరూషలేములా మనోహరంగా ఉన్నావు, జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.
5
నీ కళ్లను నా వైపు నుండి త్రిప్పు; అవి నన్ను వశపరచుకుంటాయి. నీ శిరోజాలు గిలాదు వంపుల నుండి దిగివస్తున్న మేకల మందల్లా ఉన్నాయి.
6
నీ పళ్ళు అప్పుడే కడుగబడి పైకి వస్తున్న గొర్రె మందలా ఉన్నాయి. ప్రతిదీ జంటగా ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా తప్పిపోలేదు.
7
నీ ముసుగు వెనుక ఉన్న నీ చెక్కిళ్ళు, విచ్చిన ఒక దానిమ్మ పండులా ఉన్నాయి.
8
అరవైమంది రాణులు, ఎనభైమంది ఉంపుడుగత్తెలు, అసంఖ్యాకులైన కన్యకలు ఉండవచ్చు;
9
కాని నా పావురం, నా అందాలరాశి, ఒకతే, తన తల్లికి ఒక్కగానొక్క కుమార్తె, తనను కన్నదానికి ఇష్టమైనది. యువతులు ఆమెను చూసి ఆమెను ధన్యురాలు అని పిలిచారు; రాణులు ఉంపుడుగత్తెలు ఆమెను ప్రశంసించారు.
10
తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, సూర్యునిలా ప్రకాశవంతంగా, నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options