Skip to content
కీర్తనలు 89:38-51

కీర్తనలు 89:38-51

38
కాని మీరు నన్ను తిరస్కరించి త్రోసివేశారు, మీరు అభిషేకించిన వానిపై మీరు చాలా కోపంగా ఉన్నారు.
39
మీరు మీ సేవకునితో చేసిన ఒడంబడికను విడిచిపెట్టి, అతని కిరీటాన్ని ధూళిలో పడవేసి అపవిత్రం చేశారు.
40
మీరు అతని ప్రాకారపు గోడలు పడగొట్టారు అతని బలమైన కోటలను పాడుచేశారు.
41
దారిన వెళ్లే వారందరూ అతన్ని దోచుకున్నారు; అతని పొరుగువారు అతడిని అపహాస్యం చేశారు.
42
మీరు అతని శత్రువుల కుడిచేతిని బలపరిచారు; అతని శత్రువులందరు ఆనందించేలా చేశారు.
43
నిజానికి, మీరు అతని ఖడ్గం అంచును వెనుకకు తిప్పారు యుద్ధంలో అతనికి సాయం చేయలేదు.
44
మీరు అతని వైభవాన్ని అంతం చేశారు అతని సింహాసనాన్ని నేలమీద పడవేశారు.
45
అతని యవ్వన దినాలను తగ్గించారు; అవమానంతో అతన్ని కప్పారు. సెలా
46
ఎంతకాలం, యెహోవా? ఎప్పటికీ మీరు మరుగై ఉంటారా? ఎంతకాలం మీ ఉగ్రత అగ్నిలా మండుతూ ఉంటుంది?
47
నా ఆయుష్షు ఎంత నిలకడలేనిదో జ్ఞాపకం చేసుకోండి, వ్యర్థంగా మీరు మనుష్యులందరిని సృష్టించారు కదా!
48
మరణం చూడకుండ ఎవరు బ్రతకగలరు? సమాధి బలం నుండి మనిషిని ఎవరు రక్షించగలరు? సెలా
49
ప్రభువా, మీ నమ్మకత్వంతో మీరు దావీదుకు వాగ్దానం చేసి మీరు మొదట చూపిన ఆ మారని ప్రేమ ఎక్కడ?
50
ప్రభువా, మీ సేవకులు ఎలా ఎగతాళి చేయబడ్డారో, అన్ని దేశాల నిందలను నేను నా హృదయంలో ఎలా భరిస్తున్నానో
51
యెహోవా, అవి మీ శత్రువులు ఎగతాళిగా చేసిన నిందలు, అడుగడుగునా మీ అభిషిక్తుని వారు చేసిన ఎగతాళి జ్ఞాపకం తెచ్చుకోండి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options