కీర్తనలు 77:1-6
1
సంగీత దర్శకుడైన యెదూతూనుకు. ఒక ఆసాపు కీర్తన. నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను.
2
నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను; అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను, నాకు ఆదరణ కలుగలేదు.
3
దేవా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖించాను; నేను ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ సొమ్మసిల్లింది. సెలా
4
మీరు నా కనురెప్పలు తెరిచి ఉంచారు నేను మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను.
5
మునుపటి రోజులను గురించి, చాలా కాలంనాటి సంవత్సరాలను గురించి నేను ఆలోచించాను.
6
రాత్రివేళ నేను నా పాటలు జ్ఞాపకం చేసుకున్నాను. నా హృదయం ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ అడిగింది:
Settings