Skip to content
కీర్తనలు 60:6-12

కీర్తనలు 60:6-12

6
దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట: “విజయంతో నేను షెకెమును పంచుతాను సుక్కోతు లోయను కొలుస్తాను.
7
గిలాదు నాది, మనష్షే నాది; ఎఫ్రాయిం నా శిరస్త్రాణం, యూదా నా రాజదండం.
8
మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను, ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”
9
కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు? ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు?
10
దేవా, ఇప్పుడు మమ్మల్ని విసర్జించింది మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?
11
శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి, ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.
12
దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options