Skip to content
కీర్తనలు 60:1-5

విలాపం మరియు పునరుద్ధరణ కొరకు విజ్ఞప్తి

కీర్తనలు 60:1-5
1
సంగీత దర్శకునికి. “నిబంధన పుష్పం” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. దావీదు అరాము నహరయీము వారితోను అరాము సోబా వారితోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పు లోయలో పన్నెండువేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు వ్రాసినది. దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు; మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి!
2
మీరు దేశాన్ని కంపింపజేసి దానిని చీల్చివేశారు; దాని పగుళ్లను పూడ్చండి, ఎందుకంటే అది కంపిస్తూ ఉంది.
3
మీరు మీ ప్రజలకు కఠిన సమయాలను చూపించారు; మమ్మల్ని తడబడేలా చేసే మద్యాన్ని మీరు మాకు ఇచ్చారు.
4
సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి మీకు భయపడేవారికి మీరొక జెండాను ఇచ్చారు. సెలా
5
మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options