కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 50:16-21

దుష్టుల ఖండన

కీర్తనలు 50:16-21
16
దుష్టులతో దేవుడు ఇలా అంటున్నారు: “నా న్యాయవిధులు ఉచ్చరించే నా నిబంధనను మీ పెదాల మీదికి తీసుకునే హక్కు మీకెక్కడిది?
17
నా సూచనను మీరు అసహ్యించుకుంటారు, నా మాటల్ని మీ వెనుకకు పారవేస్తారు.
18
మీరు ఒక దొంగను చూస్తే, వాడితో కలిసిపోతారు; మీ భాగాన్ని వ్యభిచారులతో పంచుకొంటారు.
19
మీ నోటిని చెడుకు వాడుతారు మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు.
20
మీరు కూర్చుని మీ సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు, మీ సొంత తల్లి కుమారుని మీద అభాండాలు వేస్తారు.
21
మీరు ఇవి చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను, నేను మీలాంటి వాణ్ణే అని మీరనుకున్నారు. కాని నేనిప్పుడు మిమ్మల్ని నిలదీస్తున్నాను, నా ఆరోపణలను మీ ముందు పెడుతున్నాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options