కీర్తనలు 38:15-22
15
యెహోవా, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను; ప్రభువా నా దేవా, మీరు జవాబిస్తారు.
16
నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను.
17
నేను పడిపోయేలా ఉన్నాను, నా బాధ నిత్యం నాతోనే ఉంది.
18
నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను; నా పాపాన్ని గురించి బాధపడుతున్నాను.
19
కారణం లేకుండ అనేకులు నాకు శత్రువులయ్యారు; కారణం లేకుండ అనేకులు నన్ను ద్వేషిస్తున్నారు;
20
నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు, నేను మంచిని మాత్రమే అనుసరిస్తున్నా సరే, వారు నన్ను వ్యతిరేకిస్తున్నారు.
21
యెహోవా, నన్ను విడువకండి; నా దేవా, నాకు దూరంగా ఉండకండి.
22
నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి.
Settings