కీర్తనలు 38:9-14
9
ప్రభువా, నా కోరికలన్నీ మీ ముందు ఉన్నాయి; నా నిట్టూర్పు మీ నుండి ఉంది.
10
నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది; నా కంటి చూపు తగ్గిపోతుంది.
11
నా గాయాల వల్ల నా స్నేహితులు నా సహచరులు నన్ను దూరం పెడుతున్నారు; నా పొరుగువారు నన్ను దూరంగా ఉంచుతున్నారు.
12
నన్ను చంపాలనుకున్నవారు ఉచ్చులు బిగుస్తున్నారు, నాకు హాని కలిగించేవారు నా పతనం గురించి మాట్లాడుతున్నారు; రోజంతా వారు కుట్రలు చేస్తున్నారు.
13
చెవిటివానిలా నేను వినక ఉన్నాను, మూగవానిలా మాట్లాడక ఉన్నాను;
14
నేను వినలేనివానిగా అయ్యాను, జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను.
Settings