కీర్తనలు 119:30-53
30
నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను; మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను.
31
యెహోవా, మీ శాసనాలను గట్టిగా పట్టుకుని ఉంటాను; నాకు అవమానం కలగనివ్వకండి.
32
మీ ఆజ్ఞల మార్గాన నేను పరుగెడతాను, ఎందుకంటే మీరు నా గ్రహింపును విశాలపరిచారు.
33
యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి, అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను.
34
మీ ధర్మశాస్త్రం నేను అనుసరించేలా హృదయపూర్వకంగా వాటికి విధేయత చూపేలా, నాకు గ్రహింపు దయచేయండి.
35
మీ ఆజ్ఞల మార్గాన నన్ను నడిపించండి, అక్కడే నాకు ఆనందము.
36
నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక మీ శాసనాల వైపుకు త్రిప్పండి.
37
పనికిరాని వాటినుండి నా కళ్లను త్రిప్పండి; మీ మార్గాల ద్వార నా జీవితాన్ని కాపాడండి.
38
మీ సేవకునిపట్ల మీ మాటను నెరవేర్చండి, తద్వారా ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.
39
నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి, ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి.
40
మీ కట్టడల కోసం నేను ఎంతగా తహతహ లాడుతున్నాను! మీ నీతిలో నా జీవితాన్ని కాపాడండి.
41
యెహోవా, మీ మారని ప్రేమ, మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక.
42
అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము.
43
మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి, ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను.
44
నేను ఎల్లప్పుడు అంటే నిరంతరం, మీ ధర్మశాస్త్రానికి లోబడతాను.
45
నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.
46
రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను నేను సిగ్గుపడను,
47
నేను మీ ఆజ్ఞలలో ఆనందిస్తాను ఎందుకంటే అవంటే నాకు ప్రేమ.
48
నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను, తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను.
49
మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు.
50
నా శ్రమలో నా ఆదరణ ఇదే: మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది.
51
అహంకారులు కనికరం లేకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, కాని నేను మీ ధర్మశాస్త్రం నుండి తిరిగిపోను.
52
యెహోవా, మీ అనాది న్యాయవిధులు నాకు జ్ఞాపకం ఉన్నాయి, వాటిలో నాకెంతో ఆదరణ.
53
మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన దుష్టులను బట్టి, నాకు చాలా కోపం వస్తుంది.
Settings