Skip to content
కీర్తనలు 106:23-32

కీర్తనలు 106:23-32

23
“వీరిని నాశనం చేస్తాను” అన్నాడు దేవుడు. మోషే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆయన వచ్చి దేవుని ఎదుట సందులో నిలిచి విజ్ఞాపన చేస్తే ఆయన ఉగ్రత వారిని ధ్వంసం చేయకుండా ఆపింది.
24
మనోహరమైన దేశాన్ని వారు తిరస్కరించారు; వారాయన మాట నమ్మలేదు.
25
యెహోవా మాట వినక, డేరాలలో సణగ సాగారు.
26
కాబట్టి ఆయన తన చేయెత్తి, వారిని ఎడారిలో పతనమయ్యేలా చేస్తాను,
27
వారి సంతతివారిని దేశాల మధ్య పతనమయ్యేలా చేస్తాను, దేశాలకు వారిని చెదరగొడతాను, అని ప్రమాణం చేశారు.
28
వారు బయల్-పెయోరు దగ్గరి విగ్రహం దగ్గర చేరారు. నిర్జీవ విగ్రహాలకు పెట్టిన నైవేద్య బలులు తిన్నారు.
29
తమ దుష్ట చర్యల చేత వారు దేవునికి కోపం రేపారు. అందుకు వారి మధ్యకు తెగులు మొదలైంది.
30
ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు. తెగులు ఆగిపోయింది.
31
అది అంతులేని తరాలకు అతనికి నీతిగా ఎంచబడింది.
32
మెరీబా నీళ్ల దగ్గర వారంతా దేవుని కోపాగ్ని రేపారు, వారి మూలంగా మోషేకు బాధ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options