సామెతలు 30:1-6
1
యాకె కుమారుడైన అగూరు సూక్తులు. ఈ మనుష్యుడు ఇతీయేలుకు చెప్పిన మాట: “దేవా, నేను అలసిపోయాను, కాని నేను గెలుస్తాను.
2
నిజంగా నేను క్రూరమైనవాన్ని, మనుష్యుని కాదు; మనుష్యులకు ఉండే ఇంగిత జ్ఞానం నాకు లేదు.
3
నేను జ్ఞానాన్ని అభ్యాసం చేయలేదు, పరిశుద్ధుని గురించిన తెలివి నాకు లేదు.
4
ఆకాశానికెక్కి మరలా దిగినవారెవరు? తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్న వారెవరు? బట్టలో నీళ్లు మూట గట్టినవారెవరు? భూమి దిక్కులను నెలకొల్పినది ఎవరు? ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి!
5
“దేవుని మాటలు పరీక్షించబడినవి; ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు.
6
ఆయన మాటలకు కలపవద్దు, ఆయన నిన్ను గద్దించి నిన్ను అబద్ధికుడవని నిరూపిస్తారు.
Settings