Skip to content
సామెతలు 3:21-26

సామెతలు 3:21-26

21
నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో, వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు;
22
అవి నీకు జీవంగా, నీ మెడకు అలంకార ఆభరణంగా ఉంటాయి.
23
అప్పుడు నీ మార్గంలో నీవు క్షేమంగా నడుస్తావు, నీ పాదం తడబడదు.
24
నీవు పడుకున్నప్పుడు, భయపడవు; నీవు పడుకున్నప్పుడు, నీ నిద్ర మధురంగా ఉంటుంది.
25
హఠాత్తుగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవు.
26
యెహోవా నీ ప్రక్కన ఉంటారు, నీ పాదాలు వలలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options