సామెతలు 3:27-35
27
నీవు క్రియ చేయగల అధికారం నీవు కలిగి ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉండవద్దు.
28
నీవు నీ పొరుగువానికి ఇప్పుడు సహాయం చేయ కలిగి ఉండి, “రేపు రా నేను ప్రయత్నిస్తాను” అని నీ పొరుగువానితో అనవద్దు.
29
నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు వారికి హాని తలపెట్టవద్దు.
30
నీకు హాని చేయని మనుష్యులతో, కారణం లేకుండా వాదించవద్దు.
31
హింసాత్మకమైనవారిని అసూయ పడకు, వారి మార్గాల్లో వేటిని నీవు ఎంచుకోవద్దు.
32
మూర్ఖులు యెహోవాకు అసహ్యులు కాని యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు.
33
దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది, కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు.
34
ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.
35
జ్ఞానులు ఘనతను పొందుతారు, మూర్ఖులు అవమానాన్ని పొందుతారు.
Settings