Skip to content
సామెతలు 4:1-9

సామెతలు 4:1-9

1
నా కుమారులారా, తండ్రి ఉపదేశాలను ఆలకించండి; వాటిని శ్రద్ధగా ఆలకించండి వివేకం పొందండి.
2
మీకు నేను మంచి ఉపదేశాలను ఇస్తాను, కాబట్టి నా బోధను త్రోసివేయకండి.
3
నేను కూడా నా తండ్రికి కుమారుడను, నా తల్లికి నేను ఏకైక సుకుమారుడను.
4
నా తండ్రి నాకు బోధించి, నాతో చెప్పిందేమిటంటే, “నీ హృదయపూర్వకంగా నా మాటలను గట్టిగా పట్టుకో; నా ఆజ్ఞలను పాటించు, నీవు బ్రతుకుతావు.
5
జ్ఞానాన్ని సంపాదించుకో, వివేకాన్ని సంపాదించుకో; నా మాటలు మరచిపోవద్దు, వాటినుండి తొలగిపోవద్దు.
6
నీవు జ్ఞానాన్ని విడచిపెట్టకు, అది నిన్ను కాపాడుతుంది; నీవు దానిని ప్రేమించు, ఆమె నీకు కావలిదానిగా ఉంటుంది.
7
జ్ఞానానికి ఆరంభం ఇది: జ్ఞానం సర్వోన్నతమైనది, దానిని పొందుకో. నీకున్నదంతా ఖర్చైనా సరే, వివేకాన్ని సంపాదించుకో.
8
దానిని నీవు గారాబం చేస్తే, అది నిన్ను హెచ్చిస్తుంది; దానిని నీవు హత్తుకుంటే అది నీకు ఘనత కలిగిస్తుంది.
9
అది నీ తలపై అందమైన మాలను ఉంచుతుంది అద్భుతమైన కిరీటాన్ని ఇస్తుంది.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options