సామెతలు 25:23-28
23
ఊహించని వర్షాన్ని తెచ్చే ఉత్తర గాలిలా కపటమైన నాలుక భయానకంగా కనిపించేలా చేస్తుంది.
24
గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు.
25
అలసిన ప్రాణానికి చల్లటి నీరు ఎలా ఉంటుందో దూరదేశము నుండి వచ్చిన మంచి వార్త అలా ఉంటుంది.
26
నీతిమంతుడు దుష్టునికి మార్గం ఇవ్వడం ఊటను బురదమయం లేదా బావిని కలుషితం చేయడం లాంటిది.
27
తేనె ఎక్కువగా తినడం మంచిది కాదు, ప్రజలు తమ సొంత కీర్తిని కోరుకోవడం గౌరవప్రదం కాదు.
28
మనస్సు అదుపు చేసుకోలేని వ్యక్తి ప్రాకారాలు కూలిన పట్టణం లాంటివాడు.
Settings