Skip to content
సామెతలు 24:23-29

జ్ఞానుల మరిన్ని సామెతలు

సామెతలు 24:23-29
23
ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే: న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు
24
“నీవు అమాయకుడవు” అని దోషులతో చెప్పేవారిని, ప్రజలు శపిస్తారు దేశాలు అసహ్యించుకుంటారు.
25
న్యాయంగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును అధికమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.
26
నిజాయితీగల జవాబు పెదవులపై పెట్టే ముద్దు లాంటిది.
27
ముందుగా నీ బయటి పని చక్క పెట్టుకో నీ పొలాలను సిద్ధపరచుకో; దాని తర్వాత, నీ ఇల్లు కట్టుకో.
28
కారణం లేకుండ నీ పొరుగువానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దు; నీ పెదవులతో తప్పుత్రోవ పట్టిస్తావా?
29
“వారు నాకు చేసినట్లు నేను వారికి చేస్తాను; వారు చేసిన దానికి వారికి తిరిగి చెల్లిస్తాను” అని అనుకోవద్దు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options