కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 21:10-19

న్యాయం, పరిణామాలు, సంపద

సామెతలు 21:10-19
10
దుష్టుని హృదయం కీడు చేయాలని కోరుతుంది; తన పొరుగువారి మీద వాడు దయచూపించడు.
11
ఎగతాళి చేసేవాడు శిక్షించబడినప్పుడు, సామాన్యుడు జ్ఞానాన్ని పొందుతాడు; జ్ఞానుల పట్ల శ్రద్ధ చూపడం ద్వారా వారు తెలివి సంపాదిస్తారు.
12
నీతిమంతుడు దుష్టుల ఇంటిని గమనించి, దుష్టులను నాశనం చేస్తాడు.
13
బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు, తాను మొరపెట్టినప్పుడు జవాబు రాదు.
14
చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది, ఒడిలో ఉంచబడిన లంచం పగను సమాధానపరుస్తుంది.
15
న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరం కాని చెడు చేసేవారికి అది భయంకరము.
16
వివేకమైన మార్గం నుండి తొలగిపోయే వ్యక్తి మృతుల గుంపులో అంతమవుతాడు.
17
సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది; ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది.
18
నీతిమంతుల కోసం భక్తిలేనివారు, అలాగే యథార్థవంతులకు నమ్మకద్రోహులు క్రయధనమవుతారు.
19
ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే అడవిలో నివసించడం మంచిది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options