Skip to content
సామెతలు 21:20-26

శ్రమ, ఆత్మనిగ్రహం, సోమరితనం

సామెతలు 21:20-26
20
జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి, కానీ బుద్ధిలేని మనుష్యులు తాము పొందుకున్నదంతా ఖర్చు చేస్తారు.
21
నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు.
22
జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లి వారు నమ్ముకున్న బలమైన కోటను కూల్చివేయగలడు.
23
నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు,
24
అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరు వారు మిక్కిలి గర్వంతో నడుచుకుంటారు.
25
సోమరుల కోరికలు వారిని చంపుతాయి, ఎందుకంటే వారి చేతులు పని చేయడానికి నిరాకరిస్తాయి.
26
పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు, కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options