సామెతలు 19:4-9
4
డబ్బుగల వానికి స్నేహితులు ఎక్కువగా ఉందురు, పేదవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు.
5
అబద్ధసాక్షి శిక్షను పొందక పోదు అబద్ధాలాడే వాడు తప్పించుకోడు.
6
అనేకులు గొప్పవారి దయ వెదుకుతారు, బహుమతులు ఇచ్చేవారికి ప్రతి ఒక్కరూ స్నేహితులే.
7
పేదవారిని తమ బంధువులందరు దూరంగా ఉంచుతారు, అలాంటప్పుడు వారి స్నేహితులు ఇంకెంత దూరంగా ఉంచుతారు! పేదవారు బ్రతిమిలాడుతూ వారిని వెంటాడినా, వారు ఎక్కడా కనిపించలేదు.
8
తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు; మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.
9
అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును.
Settings