సామెతలు 19:10-15
10
భోగములను అనుభవించుట బుద్ధిలేని వానికి తగదు, రాజుల మీద పెత్తనము చెలాయించుట పనివానికి బొత్తిగా తగదు.
11
ఒక వ్యక్తి తెలివి వానికి ఓర్పును కలిగిస్తుంది; ఒక నేరాన్ని పట్టించుకోకపోవడం ఒక వ్యక్తికి ఘనత కలిగిస్తుంది.
12
రాజు కోపం సింహగర్జన వంటిది, అతని దయ తుక్కు మీద కురియు మంచు వంటిది.
13
బుద్ధిహీనుని పిల్లలు తన తండ్రికి నష్టము తెచ్చును, భార్యతోటిపోరు ఆగకుండా పడుచుండు నీటిబొట్లతో సమానము.
14
ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.
15
సోమరితనం గాఢనిద్ర కలుగజేస్తుంది, సోమరివాడు తిండి లేక ఉంటాడు.
Settings