కంటెంట్‌కు వెళ్లండి
సంఖ్యాకాండము 29:12-40

సంఖ్యాకాండము 29:12-40

12
“ ‘ఏడవ నెల పదిహేనవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. యెహోవా కోసం ఏడు రోజులు పండుగ ఆచరించాలి.
13
యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని పదమూడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి.
14
పదమూడు కోడెల్లో ప్రతి దానితో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల పిండి తేవాలి; రెండు పొట్టేళ్లలో ఒక్కో దానితో రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి;
15
పద్నాలుగు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి.
16
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
17
“ ‘రెండవ రోజున లోపం లేని పన్నెండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
18
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
19
అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
20
“ ‘మూడవ రోజు లోపం లేని పదకొండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
21
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
22
అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
23
“ ‘నాలుగవ రోజున లోపం లేని పది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
24
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
25
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
26
“ ‘అయిదవ రోజు లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
27
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
28
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
29
“ ‘ఆరవరోజు లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
30
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
31
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
32
“ ‘ఏడవ రోజున లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
33
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
34
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
35
“ ‘ఎనిమిదవ రోజున ప్రత్యేక సభగా కూడుకోవాలి, పని ఏదీ చేయకూడదు.
36
యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి.
37
కోడె, పొట్టేలు గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
38
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
39
“ ‘మీ మ్రొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలతో పాటు వీటిని నియమించబడిన పండుగల్లో యెహోవాకు అర్పించాలి: మీ దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు, సమాధానబలులు.’ ”
40
యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options