Skip to content
సంఖ్యాకాండము 29:7-11

ప్రాయశ్చిత్త దిన అర్పణలు

సంఖ్యాకాండము 29:7-11
7
“ ‘ఏడవ నెల పదవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి. మీరు ఉపవాసముండాలి ఏ పని చేయకూడదు.
8
యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి.
9
కోడెతో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి తేవాలి; పొట్టేలుతో రెండు ఓమెర్లు;
10
ఏడు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి.
11
అంతేకాక ప్రాయశ్చిత్తం కొరకైన పాపపరిహారబలి, క్రమంగా అర్పించే దహనబలి, భోజనార్పణ, వారి పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options