సంఖ్యాకాండము29
Listen to this chapter
0:00
0:00
బూరల పండుగ అర్పణలు
1
“ ‘ఏడవ నెల మొదటి రోజు పరిశుద్ధ సభను ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. ఆ రోజు మీరు బూరల ధ్వని చేసే రోజు.
2
యెహోవాకు ఇష్టమైన సువాసనగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలను దహనబలిగా అర్పించాలి.
3
కోడెతో పాటు భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి తేవాలి; పొట్టేలుతో రెండు ఓమెర్లు;
4
ఏడు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి.
5
అంతేకాక మీకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహారబలిగా మేకపోతును కూడా అర్పించాలి.
6
ఇవి నిర్దేశించబడిన ప్రతి నెలనెలా అనుదినం దహనబలులకు అధనంగా వాటి భోజనార్పణలు, పానార్పణలు. ఇవి యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలులుగా తేవాలి.
ప్రాయశ్చిత్త దిన అర్పణలు
7
“ ‘ఏడవ నెల పదవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి. మీరు ఉపవాసముండాలి ఏ పని చేయకూడదు.
8
యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు గొర్రెపిల్లలను అర్పించాలి.
9
కోడెతో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి తేవాలి; పొట్టేలుతో రెండు ఓమెర్లు;
10
ఏడు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి.
11
అంతేకాక ప్రాయశ్చిత్తం కొరకైన పాపపరిహారబలి, క్రమంగా అర్పించే దహనబలి, భోజనార్పణ, వారి పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
పర్ణశాలల పండుగ అర్పణలు: మొదటి దినం
12
“ ‘ఏడవ నెల పదిహేనవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. యెహోవా కోసం ఏడు రోజులు పండుగ ఆచరించాలి.
13
యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని పదమూడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి.
14
పదమూడు కోడెల్లో ప్రతి దానితో పాటు భోజనార్పణగా నూనెతో కలిపిన మూడు ఓమెర్ల పిండి తేవాలి; రెండు పొట్టేళ్లలో ఒక్కో దానితో రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి;
15
పద్నాలుగు గొర్రెపిల్లలలో ప్రతి దానితో ఒక ఓమెరు నాణ్యమైన పిండి అర్పించాలి.
16
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
పర్ణశాలల పండుగ రెండవ దినం
17
“ ‘రెండవ రోజున లోపం లేని పన్నెండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
18
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
19
అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
పర్ణశాలల పండుగ మూడవ దినం
20
“ ‘మూడవ రోజు లోపం లేని పదకొండు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
21
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
22
అంతేకాక, ప్రతిరోజు దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
పర్ణశాలల పండుగ నాల్గవ దినం
23
“ ‘నాలుగవ రోజున లోపం లేని పది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
24
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
25
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
పర్ణశాలల పండుగ ఐదవ దినం
26
“ ‘అయిదవ రోజు లోపం లేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
27
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
28
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
పర్ణశాలల పండుగ ఆరవ దినం
29
“ ‘ఆరవరోజు లోపం లేని ఎనిమిది కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
30
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
31
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
పర్ణశాలల పండుగ ఏడవ దినం
32
“ ‘ఏడవ రోజున లోపం లేని ఏడు కోడెలను, రెండు పొట్టేళ్లను, ఏడాది వయస్సున్న పద్నాలుగు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.
33
కోడెలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
34
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
ఎనిమిదవ రోజు సభ అర్పణలు
35
“ ‘ఎనిమిదవ రోజున ప్రత్యేక సభగా కూడుకోవాలి, పని ఏదీ చేయకూడదు.
36
యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా లోపం లేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలను హోమబలిగా అర్పించాలి.
37
కోడె, పొట్టేలు గొర్రెపిల్లలతో పాటు సూచించబడిన సంఖ్య ప్రకారం భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి.
38
అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు, పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.
సంగ్రహం మరియు ఆజ్ఞ
39
“ ‘మీ మ్రొక్కుబళ్ళు, స్వేచ్ఛార్పణలతో పాటు వీటిని నియమించబడిన పండుగల్లో యెహోవాకు అర్పించాలి: మీ దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు, సమాధానబలులు.’ ”
40
యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా మోషే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Reading Width chars
Options
Study Note