కంటెంట్‌కు వెళ్లండి
సంఖ్యాకాండము 23:18-26

బిలాము రెండవ ప్రవచనం: దేవుని విశ్వసనీయత

సంఖ్యాకాండము 23:18-26
18
అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు! లేచి, విను; సిప్పోరు కుమారుడా! నా మాట విను.
19
అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు, మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట్లాడి క్రియ చేయరా? ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా?
20
ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను; ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను.
21
“యాకోబులో ఎటువంటి దోషం కనిపించలేదు, ఇశ్రాయేలులో ఏ చెడు కనిపించలేదు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు; రాజు యొక్క కేక వారి మధ్య ఉన్నది.
22
దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చారు; వారికి అడవి ఎద్దుకు ఉన్న బలం ఉంది.
23
యాకోబుకు వ్యతిరేకంగా ఏ భవిష్యవాణి లేదు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునాలు లేవు. ఇప్పుడు యాకోబు గురించి, ఇశ్రాయేలు గురించి, ‘దేవుడు ఏమి చేశారో చూడండి!’
24
ప్రజలు ఆడ సింహంలా లేస్తారు; వారు తమకు తాము సింహంలా లేస్తారు అది తన వేట మాంసాన్ని మ్రింగివేసే వరకు దాని బాధితుల రక్తం త్రాగే వరకు విశ్రాంతి తీసుకోదు” అని చెప్పబడుతుంది.
25
బాలాకు బిలాముతో, “వారిని అసలు శపించకు వారిని దీవించకు!” అని అన్నాడు.
26
బిలాము బాలాకుతో, “యెహోవా ఏది చెప్తే నేను అదే చేయాలని నేను చెప్పలేదా?” అని జవాబిచ్చాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options