Skip to content
సంఖ్యాకాండము 14:13-19

సంఖ్యాకాండము 14:13-19

13
మోషే యెహోవాతో, “ఈజిప్టువారు దాని గురించి విన్నప్పుడు వారు ఏమనుకుంటారు? మీ ప్రభావం చేత వారి మధ్య నుండి వీరిని తెచ్చారు.
14
ఈ దేశ నివాసులకు దానిని గురించి వారు చెప్తారు. ఇప్పటికే మీరు యెహోవా, ఈ ప్రజలతో ఉన్నారని, మీరు ముఖాముఖిగా వీరికి కనిపిస్తారని, మీ మేఘము వీరితో ఉంటుందని, మీరు పగలు మేఘస్తంభంలో, రాతి అగ్నిస్తంభంలో ఉంటూ వారిని నడిపిస్తారని వారు విన్నారు.
15
ఒకవేళ ఎవరిని విడిచిపెట్టకుండా ఈ ప్రజలందరినీ చంపేస్తే, మీ గురించి ఈ విషయాలు విన్న దేశాలు,
16
‘యెహోవా ఈ ప్రజలకు మ్రొక్కుబడిగా వాగ్దానం చేసిన స్థలానికి తీసుకెళ్లలేక, వీరిని అరణ్యంలో చంపేశారు’ అని అంటారు.
17
“కాబట్టి మీరు ప్రకటించినట్లే, ఇప్పుడు ప్రభువు యొక్క బలం కనుపరచబడును గాక:
18
‘యెహోవా త్వరగా కోప్పడరు, ప్రేమ క్షమాగుణాలతో నిండియున్నవారు, ఆయన తిరుగుబాటును పాపాన్ని క్షమిస్తారు గాని ఆయన దోషులను నిర్దోషులుగా విడిచిపెట్టక, మూడు నాలుగు తరాల వరకు తల్లిదండ్రుల పాపానికి వారి పిల్లలను శిక్షిస్తారు.’
19
మీ గొప్ప ప్రేమను బట్టి, ఈ ప్రజల పాపాన్ని, ఈజిప్టు వదిలినప్పటి నుండి ఇప్పటివరకు వీరిని క్షమించిన ప్రకారం క్షమించండి” అని అన్నాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options