Skip to content
నెహెమ్యా 11:3-9

నెహెమ్యా 11:3-9

3
యెరూషలేములో స్థిరపడిన ప్రాంతీయ నాయకులు వీరే, (ఇశ్రాయేలీయులలో కొంతమంది, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు, సొలొమోను సేవకుల వారసులు యూదా పట్టణాల్లో వివిధ పట్టణాల్లో ఉన్న తమ సొంత స్థలాల్లో నివసించారు,
4
యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు): యూదా వారసుల నుండి: అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు;
5
మయశేయా, ఇతడు షేలా వారసుడైన జెకర్యా కుమారుడైన యోయారీబుకు పుట్టిన అదాయా కుమారుడైన హజాయాకు పుట్టిన కొల్-హోజె కుమారుడైన బారూకు కుమారుడు.
6
యెరూషలేములో నివసించిన పెరెసు వారసులు 468 మంది, వీరంతా అసాధారణమైన పోరాట యోధులు.
7
బెన్యామీను వారసుల నుండి: సల్లు, ఇతడు యెషయా కుమారుడైన ఇతీయేలుకు పుట్టిన మయశేయా కుమారుడైన కోలాయాకు పుట్టిన పెదాయా కుమారుడైన యోవేదుకు పుట్టిన మెషుల్లాము కుమారుడు,
8
అతని అనుచరులైన గబ్బయి సల్లయి అనేవారితో కలిపి 928 మంది.
9
జిఖ్రీ కుమారుడైన యోవేలు వీరి అధికారి; హస్సెనూయా కుమారుడైన యూదా ఆ పట్టణపు నూతన భాగానికి ముఖ్య అధికారి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options