Skip to content
నెహెమ్యా 1:1-3

యెరూషలేము దుస్థితి గురించి నెహెమ్యాకు సమాచారం

నెహెమ్యా 1:1-3
1
హకల్యా కుమారుడైన నెహెమ్యా మాటలు: ఇరవయ్యవ సంవత్సరం కిస్లేవు నెలలో నేను షూషను కోటలో ఉన్నప్పుడు,
2
నా సోదరులలో ఒకడైన హనానీ మరి కొంతమందితో కలిసి యూదా నుండి వచ్చారు. అప్పుడు చెరలోకి రాకుండా బయటపడి మిగిలి ఉన్న యూదుల గురించి, యెరూషలేము గురించి నేను వారిని అడిగాను.
3
వారు నాతో, “చెరలో పడకుండ బయటపడ్డవారు మన దేశంలోనే ఉన్న ఎంతో శ్రమను అవమానాన్ని అనుభవిస్తున్నారు. యెరూషలేము గోడ కూలిపోయింది. దాని గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయి” అని చెప్పారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options