Skip to content
లేవీయకాండము 15:1-11

లేవీయకాండము 15:1-11

1
యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,
2
“మీరు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పండి: ‘ఎప్పుడైనా ఏ పురుషునికైనా శరీరంలో నుండి ఏదైనా ద్రవం కారుతుంటే అది అపవిత్రమైనది.
3
అది అతని శరీరం నుండి కారుతూ ఉన్నా లేక ఆగిపోయినా అది అతన్ని అపవిత్రం చేస్తుంది. ఈ విధంగా కారడం వలన అతడు అపవిత్రుడు అవుతాడు.
4
“ ‘స్రవిస్తున్న వ్యక్తి ఏ పడక మీద పడుకున్నా అది అపవిత్రమవుతుంది, అతడు దేనిపైనా కూర్చున్న అది అపవిత్రమవుతుంది.
5
అతని పడకను తాకినవారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
6
స్రవిస్తున్న వ్యక్తి కూర్చున్న దానిపైన ఎవరు కూర్చున్నా వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
7
“ ‘స్రవిస్తున్న వ్యక్తిని ఎవరు తాకినవారు బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.
8
“ ‘స్రవిస్తున్న వ్యక్తి శుభ్రంగా ఉన్నవారిపై ఉమ్మివేస్తే, వారు బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.
9
“ ‘స్వారీ చేసేటప్పుడు ఆ వ్యక్తి కూర్చున్నది అపవిత్రమవుతుంది.
10
అతని క్రింద ఉన్న ఏ వస్తువునైనా తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు; ఆ వస్తువులను పైకెత్తినవారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
11
“ ‘స్రవిస్తున్న వ్యక్తి నీటితో చేతులు కడుక్కోకుండా ఎవరినైన తాకితే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options