కంటెంట్‌కు వెళ్లండి
లేవీయకాండము 1:10-17

లేవీయకాండము 1:10-17

10
“ ‘ఒకవేళ అర్పణ మంద నుండి తెచ్చిన దహనబలి అర్పణ అయితే, గొర్రెల నుండి గాని లేదా మేకల నుండి గాని, మీరు లోపం లేని మగవాటినే అర్పించాలి.
11
మీరు దానిని బలిపీఠానికి ఉత్తర దిక్కున యెహోవా ఎదుట వధించాలి, యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చల్లుతారు.
12
మీరు దానిని ముక్కలుగా చేయాలి, యాజకుడు దాని తల, క్రొవ్వుతో పాటు, వాటిని బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద పేర్చాలి.
13
మీరు దాని లోపలి అవయవాలను కాళ్లను నీటితో కడగాలి, యాజకుడు వాటినన్నిటిని తెచ్చి బలిపీఠం మీద దహించాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
14
“ ‘ఒకవేళ యెహోవాకు అర్పించే అర్పణ పక్షుల దహనబలి అయితే, మీరు పావురం లేదా గువ్వను అర్పించాలి.
15
యాజకుడు దానిని బలిపీఠం దగ్గరకు తెచ్చి, దాని తలను విరిచి బలిపీఠం మీద దానిని కాల్చాలి; దాని రక్తం బలిపీఠం ప్రక్కనే పిండాలి.
16
యాజకుడు ఆ పక్షి ప్రేగులను ఈకలను తీసివేసి అదంతా బలిపీఠానికి తూర్పుగా బూడిద ఉండే స్థలంలో పారవేయాలి.
17
పక్షిని పూర్తిగా విడదీయక, అతడు రెక్కల సందులో దానిని చీల్చాలి, అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కాలుతున్న కట్టెల మీద దానిని కాల్చాలి. అది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options