Skip to content
న్యాయాధిపతులు 11:34-40

విషాదకరమైన మొక్కుబడి నెరవేర్పు

న్యాయాధిపతులు 11:34-40
34
యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, అతని కుమార్తె తంబురలతో నాట్యం చేస్తూ అతన్ని ఎదుర్కోడానికి వచ్చింది. అతనికి ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె తప్ప అతనికి కుమారుడు కాని కుమార్తె కాని లేరు.
35
అతడు ఆమెను చూడగానే తన బట్టలు చింపుకొని ఏడుస్తూ, “ఓ నా బిడ్డా, నన్ను కృంగదీశావు, నేను నాశనం అయిపోయాను. నేను యెహోవాకు మ్రొక్కుబడి చేశాను, దానిని మీరలేను” అన్నాడు.
36
ఆమె అతనితో, “నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావు. నీవు ప్రమాణం చేసిన ప్రకారం నాకు చేయు, ఎందుకంటే యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగతీర్చుకున్నారు.
37
అయితే ఈ ఒక్క కోరిక తీర్చు. నేను ఇక పెళ్ళి చేసుకోను, కాబట్టి రెండు నెలలు నా స్నేహితులతో కొండల్లో సంచరిస్తూ ప్రలాపించనివ్వు.”
38
అందుకతడు, “నీవు వెళ్లవచ్చు” అని ఆమెతో అన్నాడు. రెండు నెలల వరకు అతడు ఆమెను వెళ్లనిచ్చాడు. ఆమె తన స్నేహితులతో కొండల్లోకి వెళ్లి తాను ఇక పెళ్ళి చేసుకోలేదని ప్రలాపించింది.
39
ఆ రెండు నెలల తర్వాత ఆమె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది, అతడు తన మ్రొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. ఆమె కన్యగానే ఉండిపోయింది. దీని నుండి ఇశ్రాయేలీయుల వచ్చిన ఆచారం ఏంటంటే
40
ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు యువతులు నాలుగు రోజులపాటు బయటకు వెళ్లి, గిలాదు వంశస్థుడైన యెఫ్తా కుమార్తె జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options