న్యాయాధిపతులు 10:1-5
1
అబీమెలెకు చనిపోయిన తర్వాత ఇశ్శాఖారు గోత్రం నుండి దోదో మనుమడు, పువా కుమారుడైన తోలా ఇశ్రాయేలును రక్షించడానికి లేచాడు. అతడు ఎఫ్రాయిం కొండసీమలో, షామీరులో నివసించాడు.
2
అతడు ఇరవై మూడు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు; తర్వాత అతడు చనిపోయి షామీరులో పాతిపెట్టబడ్డాడు.
3
అతని తర్వాత గిలాదు వాడైన యాయీరు లేచాడు, అతడు ఇరవై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు.
4
అతనికి ముప్పైమంది కుమారులున్నారు, వారు ముప్పై గాడిదల మీద తిరిగేవారు. వారికి గిలాదులో ముప్పై పట్టణాలు ఉన్నాయి, ఇప్పటికి వాటిని హవ్వోత్ యాయీరు పట్టణాలు అని పిలుస్తారు.
5
యాయీరు చనిపోయినప్పుడు అతన్ని కామోనులో పాతిపెట్టారు.
Settings