యెహోషువ 21:9-26
9
వారు యూదా, షిమ్యోను గోత్రాల నుండి క్రింద చెప్పిన పట్టణాలను కేటాయించారు.
10
లేవీయులైన కహాతీయుల వంశాల్లోని అహరోను సంతతివారికి ఈ క్రింది పట్టణాలు కేటాయించారు, ఎందుకంటే మొదటి చీటి వారికి పడింది:
11
వారు యూదా కొండ సీమలోని కిర్యత్-అర్బాను (అంటే హెబ్రోను) దాని చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో పాటు వారికి ఇచ్చారు. (అర్బా అనాకు పితరుడు.)
12
అయితే వారు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలను, గ్రామాలను స్వాస్థ్యంగా ఇచ్చారు.
13
కాబట్టి యాజకుడైన అహరోను సంతతివారికి హెబ్రోను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), లిబ్నా,
14
యత్తీరు, ఎష్తెమోవా,
15
హోలోను, దెబీరు,
16
ఆయిను, యుత్తా, బేత్-షెమెషు వాటి పచ్చికబయళ్లతో పాటు, ఈ రెండు గోత్రాల నుండి తొమ్మిది పట్టణాలిచ్చారు.
17
బెన్యామీను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: గిబియోను, గెబా,
18
అనాతోతు, అల్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
19
అహరోను సంతతివారైన యాజకులకు పచ్చికబయళ్లతో పాటు ఇచ్చిన పట్టణాలు మొత్తం పదమూడు.
20
లేవీయులైన కహాతీయుల వంశాలలో మిగిలిన వారికి ఎఫ్రాయిం గోత్రం నుండి కేటాయించిన పట్టణాలు:
21
ఎఫ్రాయిం కొండ సీమలో వారికి ఇచ్చినవి: షెకెము (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), గెజెరు,
22
కిబ్సాయిము, బేత్-హోరోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
23
దాను గోత్రం నుండి వారికి ఇచ్చినవి: ఎల్తెకే, గిబ్బెతోను,
24
అయ్యాలోను, గాత్-రిమ్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.
25
మనష్షే అర్థగోత్రం నుండి వారికి ఇచ్చినవి: తానాకు, గాత్-రిమ్మోను, వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం రెండు పట్టణాలు.
26
ఈ పది పట్టణాలు, వాటి పచ్చికబయళ్లు మిగిలిన కహాతీయుల వంశాలకు ఇచ్చారు.
Settings