Skip to content
యెహోషువ 21:27-33

యెహోషువ 21:27-33

27
గెర్షోనీయుల లేవీ గోత్ర వంశాలకు ఇచ్చినవి: మనష్షే అర్థగోత్రం నుండి: బాషానులోని గోలాను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), బే యెష్తెరా, వాటి పచ్చికబయళ్లతో పాటు రెండు పట్టణాలు;
28
ఇశ్శాఖారు గోత్రం నుండి: కిష్యోను, దాబెరతు,
29
యర్మూతు, ఎన్-గన్నీము దాని పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
30
ఆషేరు గోత్రం నుండి: మిషాలు, అబ్దోను,
31
హెల్కతు రెహోబు, వాటి పచ్చికబయళ్లతో పాటు నాలుగు పట్టణాలు;
32
నఫ్తాలి గోత్రం నుండి: గలిలయలోని కెదెషు (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), హమ్మోత్-దోరు, కర్తాను, వారి పచ్చికబయళ్లతో పాటు మూడు పట్టణాలు.
33
గెర్షోనీయుల వంశాల పట్టణాల సంఖ్య, వాటి పచ్చికబయళ్లతో కలిపి మొత్తం పదమూడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options