- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
దేవుడు యోబును ప్రశ్నించుట
యోబు 40:1-14
1
యెహోవా యోబుతో ఈ విధంగా అన్నారు:
2
“సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా? దేవునితో నిందించేవారు ఆయనకు జవాబు చెప్పాలి!”
3
అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు:
4
“నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? నా చేతితో నా నోరు మూసుకుంటాను.
5
ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.”
6
అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ఇలా అన్నారు:
7
“పురుషునిగా నీ నడుము కట్టుకో; నేను నిన్ను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబు చెప్పాలి.
8
“నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?
9
దేవుని బాహువులాంటిది నీకుందా? ఆయన స్వరంలా నీ స్వరం ఉరుమగలదా?
10
అలాగైతే మహిమ వైభవంతో నిన్ను నీవే అలంకరించుకో! ఘనత ప్రభావాలను ధరించుకో!
11
నీ మహా కోపాన్ని ప్రవాహంలా కుమ్మరించు, గర్విష్ఠులందరిని చూసి వారిని పడగొట్టు,
12
గర్విష్ఠులందరిని చూసి వారిని అణచివేయి, వారున్న చోటులోనే దుష్టులను నలగ్గొట్టు.
13
వారందరినీ దుమ్ములో పూడ్చిపెట్టు; వారిని సమాధిలో బంధించు.
14
అప్పుడు నీ సొంత కుడి చేయి నిన్ను రక్షించగలదని నేనే నీ ముందు ఒప్పుకుంటాను.
Settings